అక్షరటుడే, ఇందూరు: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని యోగా అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు ఐశ్వర్య కాలే పేర్కొన్నారు. నగరంలోని కిసాన్ గంజ్ లో గల ఉమా మహేశ్వరి ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి యోగా పోటీలను గురువారం నిర్వహించారు. ఈ పోటీల్లో 400 మంది పాల్గొన్నట్లు ఐశ్వర్య తెలిపారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆమె చెప్పారు. వీరు ఈనెల 31న రంగారెడ్డి జిల్లాలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెక్రెటరీ గంగాధర్, యోగా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.