అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలో బుధవారం రాత్రి పోలీసులు భారీగా గుట్కాను పట్టుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆర్ఆర్ చౌరస్తాలో తనిఖీలు చేస్తుండగా కారులో గుట్కా తరలిస్తుండడడంతో పట్టుకున్నారు. నాందేడ్‌కు చెందిన నిందితులు అంకుష్ జదల్వార్, శివాజీ గైక్వాగ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.24 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా నిజామాబాద్‌కు చెందిన సుల్తాన్ వద్ద కొనుగోలు చేసి నాందేడ్‌కు తరలిస్తున్నట్లు గుర్తించామని 2 టౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ తెలిపారు.