అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో రుణమాఫీ కానీ రైతుల కుటుంబ నిర్ధారణ సర్వే చేపట్టినట్లు మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. మెంగారం, షెట్పల్లి గ్రామాల్లో శనివారం సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ కానీ రైతులు కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలతో వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు.