అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మల్టీజోన్‌-1 పరిధిలో పనిచేస్తున్న పలువురు ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి లభించింది. 2012 బ్యాచ్ కు చెందిన పది మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి త్వరలోనే సీఐలుగా పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.