అక్షరటుడే, ఆర్మూర్‌: ఆర్మూర్‌ పట్టణంలోని మేరు సంఘం భవనంలో కమ్యూనిటీ మీడియేషన్‌ సెంటర్‌ను జిల్లా జడ్జి సునీత కుంచాల మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు కమ్యూనిటీ మీడియేషన్‌ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి నసీం సుల్తానా, జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్‌, మేరు సంఘం అధ్యక్షుడు రాజులదేవి, రవినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.