అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, కూలిన ఇళ్లు, వరదల కారణంగా చనిపోయిన వారి వివరాలు సేకరించాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల వివరాలు సేకరించాలని, అవసరమైతే బాగుచేసే వరకు సెలవు ఇవ్వాలన్నారు. విద్యుత్‌ స్తంభాలు సరిచేయాలని, వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.