అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: ధర్పల్లి ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో బుధవారం వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించారు. ఆయుష్ విభాగం జిల్లా ఇన్ ఛార్జ్ నారాయణరావు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరానికి రిటైర్డ్ ఆయుర్వేద డాక్టర్ మాధవి హాజరయ్యారు. కార్యక్రమంలో ఫార్మాసిస్టులు న్యావనంది పురుషోత్తం, మురళి, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.