అక్షరటుడే, జుక్కల్‌: గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రేణుక సూచించారు. పిట్లం మండలంలోని అన్నారం అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. కేంద్రంలో చిన్నారులకు ప్రతినెలా ఎత్తు, బరువు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ అనురాధ తదితరులు పాల్గొన్నారు.