అక్షరటుడే, ఇందూరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభమై 90 ఏళ్లు గడిచిన సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థుల్లో ఇద్దరు సభ్యులు ఒక జట్టుగా పాల్గొనాల్సి ఉంటుంది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి. రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి, జాతీయస్థాయిలో ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి రూ.2లక్షలు ద్వితీయ రూ.1.5లక్షలు తృతీయ రూ.లక్ష, జోనల్ స్థాయిలో ప్రథమ రూ.5లక్షలు ద్వితీయ రూ.4లక్షలు, తృతీయ రూ.3లక్షలు అందిస్తారు. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి రూ.10 లక్షలు, ద్వితీయ రూ.8లక్షలు తృతీయ రూ.6లక్షలు బహుమతి ఇస్తారు. పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ కళాశాలలో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.