అక్షరటుడే, ఇందూరు: భారీ వర్షాలతో నష్టపోయిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం నగరంలోని కోటగల్లిలో ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లపై దృష్టి పెట్టాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్డీవోకు ఫోన్‌ చేసి నష్టపోయిన కుటుంబాల వివరాలు చెప్పాలని అడిగారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు హరీష్‌రెడ్డి, భాను, సురేష్‌, హరీష్‌, భాస్కర్‌, పవన్‌, కృష్ణ తదితరులున్నారు.