అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని న్యాల్‌కల్‌ రోడ్డులో ఆవులను అపహరించేందుకు యత్నించిన నిందితులను పట్టుకోవాలని సూర్యనగర్‌ వాసులు నాలుగోటౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత న్యాల్‌కల్‌ రోడ్డులో ఓ ఆవును ఎత్తుకెళ్లేందుకు యత్నించారని, నిందితులను సత్వరమే అరెస్టు చేయాలని కోరారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ నరహరి, నాలుగో టౌన్‌ ఎస్సై శ్రీకాంత్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల ఇదే ప్రాంతంలో రెండు ఆవులు అపహరణకు గురైన విషయం తెలిసిందే.