అక్షరటుడే, ఇందూర్: ప్రజల నుంచి అర్జీలను స్వీకరించేందుకు ప్రతీ మంగళవారం, శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రజావాణి బుధవారం (ఈ నెల 11వ తేదీ)కు వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రజాభవన్‌లో మంగళవారం ఆర్థిక సంఘంతో సమావేశాలు నిర్వహిస్తున్న కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేశారని పేర్కొన్నారు.