అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. లింగంపేట మండలం కేంద్రంలోని సార్వజనిక్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యువజన సంఘం సభ్యులు డీఎస్పీ, ఎస్సై అరుణ్ కుమార్ను సన్మానించారు. కార్యక్రమంలో చేపూరి పోశెట్టి, దిలీప్, వంశీ, వేణుగౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.