అక్షరటుడే, ఎల్లారెడ్డి : గాంధారి మండలం గుర్జల్‌ గ్రామంలో విద్యుత్‌ షాక్ తో రైతు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అమర్లబండ రాజు తన వ్యవసాయ భూమిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద బుధవారం ఫ్యుజ్‌ వైర్లు అమర్చుతుండగా కరెంట్‌ షాక్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.