అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. మూడవ టౌన్ ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పవన్ నగర్ కు చెందిన పాటి సంతోష్(40) డెయిరీ ఫామ్ నడుపుతున్నాడు. కొన్ని రోజుల క్రితం నష్టం రావడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఆర్థికంగా కుంగిపోవడంతో ఈనెల 12న క్రిమిసంహారక మందు సేవించాడు. గమనించిన కుటుంబీకులు నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి సంతోష్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.