అక్షరటుడే, జుక్కల్ : తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలేసిన గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని వక్తలు అన్నారు. కొండా లక్ష్మణ్ వర్ధంతి సందర్భంగా శనివారం బిచ్కుందలోని మార్కండేయ మందిరం ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధుడు, పద్మశాలి ముద్దుబిడ్డ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. గంగుల శ్రీనివాస్, డాక్టర్ రాజు, గంగాధర్, బాలరాజ్, లక్ష్మణ్, పరమేష్, హన్మాండ్లు, సాయికృష్ణ, బాలకిషన్, సురేష్, సాయిలు, డాక్టర్ నర్సింలు పాల్గొన్నారు.

ఆర్మూర్‌లో..

అక్షరటుడే, ఆర్మూర్ : పట్టణంలో పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. సమితి అధ్యక్షుడు మ్యాక మోహన్ దాస్, కాందేశ్ శ్రీనివాస్, కొక్కుల రమాకాంత్ రాంపూర్ గంగాధర్, చిలివేరి రవి, నూకల నారాయణ, బండి అనంతరావు, రుద్ర రాజేశ్వర్, సైబ సుధాకర్, వేముల ప్రకాశ్, సదమస్తుల గణపతి, జింధం నరహరి, చిలుక కిష్టయ్య, ఆడేపు ప్రభాకర్, అందే నాగేశ్వర్, కట్కం నరేందర్ పాల్గొన్నారు.