అక్షరటుడే, ఆర్మూర్ : వేల్పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కొతినేటి ముత్యంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీసీ కార్యదర్శి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వైస్ ఛైర్మన్‌గా గడ్డం నర్సారెడ్డిని నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు మరో 16 మంది సభ్యులను కూడా నియమించారు.