అక్షరటుడే, ఇందూరు: ఎడపల్లి మండలం జానకంపేటలో పట్టాలు పొందిన ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని బాలాజీ వికలాంగుల సంఘం అధ్యక్షుడు గంగాధర్ కోరారు. సోమవారం ప్రజావాణిలో ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా జానకంపేటలో వికలాంగులంతా గుడిసెలు వేసుకుని ఉంటున్నామన్నారు. ఇందులో 50 మందికి పట్టాలు ఇచ్చారని చెప్పారు. కానీ విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని, రూ.5లక్షలు కట్టాలంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు అండగా నిలిచి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మురళి, సాయన్న, లక్ష్మణ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.