అక్షరటుడే, నిజామాబాద్‌రూరల్: జాతీయ రహదారిపై బైకును కంటెయినర్ ఢీకొన్న ఘటనలో వృద్ధురాలు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ఇందల్వాయి మండలం గన్నారం ముఖద్వారం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం కంటెయినర్ బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న దంపతులు బుచ్చి మల్లయ్య, కుర్మా గంగవ్వ(70) కిందపడిపోయారు. కాగా.. తీవ్రగాయాలవడంతో గంగవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. మల్లయ్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.