అక్షరటుడే, ఇందూరు : గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ విద్యార్థులు పరిసరాల పరిశుభ్రంపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కంఠేశ్వర్ ప్రాంతంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.