అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ దిగుమతులు తగ్గడంతో ధరలు 15 రోజుల్లోనే విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే స్థానిక వ్యాపారులు కూడా అడ్డగోలుగా ధరలు పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. నిజామాబాద్ గంజ్ మార్కెట్ లో కిలో తెల్ల ఉల్లిగడ్డ ధర రూ.60 ఉండగా, ఎర్ర ఉల్లిగడ్డ ధర రూ.50కి పైగా పలుకుతోంది.