సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం ఒంటరి పల్లి గ్రామంలో శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను జడ్పిటీసీ సభ్యురాలు ఏలేటి శ్రీలతరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో జడ్పీ నిధులతో సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పల్లెల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంతోష్ రెడ్డి, రామ్ రెడ్డి, రాజిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సాయి రెడ్డి, కమ్మరి దత్తు, రాజు తదితరులు పాల్గొన్నారు.