అక్షరటుడే, కామారెడ్డి టౌన్: వరిలో తడి లేకుండా చూసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, రుద్రూర్ వరి పరిశోధన శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని అడ్లూరులో గురువారం వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాలతో సుడిదోమ ఆశించే అవకాశం ఉందని.. దాని నివారణకు రైతులు పొలంలో తడి లేకుండా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అపర్ణ, ఏవో పవన్, ఏఈవో దేవేంద్ర పాల్గొన్నారు.