అక్షర టుడే, ఆర్మూర్ : మండల నూతన రేషన్ డీలర్ల కార్యవర్గం గురువారం ఎన్నికైంది. నూతన అధ్యక్షుడిగా అబ్దుల్ అజీం, కార్యదర్శిగా కామని నరేశ్, కోశాధికారిగా పిప్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు అజీమ్ పేర్కొన్నారు. అనంతరం వారు తహశీల్దార్ గజానన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.