అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని సోమేశ్వర గ్రామంలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మప్ప, కమలవ్వకు చెందిన రేకుల ఇంట్లో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి దగ్ధమైంది. ఇంట్లోని వస్తువులు, దుస్తులు, వంటపాత్రలు, బియ్యం పూర్తిగా కాలిపోయాయని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరాడు.