అక్షరటుడే, బోధన్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన చిన్నమావంది సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం బెక్‌నెల్లికి చెందిన సంతోష్(38) బైకుపై వెళ్తుండగా చిన్నమావంది – కొప్పర్గ దారిలో కారు ఢీకొట్టింది. దీంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగనాథ్ తెలిపారు.