ఎస్సై మోసం చేశాడంటూ స్టేషన్ లో మహిళ నిరసన

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్: తనను ఎస్సై మోసం చేశాడంటూ ఓ మహిళ ఇందల్వాయి స్టేషన్ ఎదుట ఆదివారం రాత్రి నిరసన తెలిపింది. సదరు ఎస్సై ఇందల్వాయి స్టేషన్ లోనే పని చేస్తుండటం గమనార్హం. దీంతో ఎస్బీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఎస్సైపై సదరు మహిళ చేసిన ఆరోపణలు వాస్తవమేనని తేల్చారు.
మరోవైపు మహిళ నిరసన తెలపడంతో సదరు ఎస్సై ఉన్నఫలంగా సెలవు పెట్టి వెళ్ళారు. శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Kamareddy | బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి