అక్షరటుడే, ఎల్లారెడ్డి: డిజిటల్ క్రాప్ సర్వేతో తమపై పని ఒత్తిడి పెరుగుతుందని ఏఈవోలు అన్నారు. మంగళవారం లింగంపేట ఏఈవోలు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. ఒక ఏఈవో 6 వేల నుంచి 10 వేల ఎకరాలు సర్వే చేయటం కష్టమన్నారు. సర్వే కోసం గ్రామ స్థాయిలో సహాయకులను నియమించాలని కోరారు. ఏఈవోలు రాకేష్, సంతోష్, మధుసూదన్, అమీర్, నవ్య తదితరులు పాల్గొన్నారు.