స్పెషల్ బ్రాంచిలో ప్రక్షాళన!

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్: కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఎట్టకేలకు ప్రక్షాళన జరిగింది. పలువురు సిబ్బందిని బదిలీ చేస్తూ.. సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ టౌన్ మినహా ఇతర చోట్ల పనిచేస్తున్న వారంతా బదిలీ అయ్యారు. ఇటీవల నకిలీ పత్రాల పాస్పోర్టు వ్యవహారంపై తీవ్ర చర్చ జరిగింది. ఏఎస్సై లక్ష్మణ్ ను సీఐడీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది. ఈ నేపథ్యంలోనే స్పెషల్ బ్రాంచి విభాగం సిబ్బందిని బదిలీ చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Inspector Transfers | రాష్ట్రంలో పలువురు సీఐల బదిలీ