అక్షరటుడే, ఆర్మూర్: రైతులను తప్పుదోవ పట్టించడం మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి తగదని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోయా పంటను కొనుగోలు చేయడంలేదని ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రైతులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని గుర్తు చేశారు.