అక్షరటుడే, ఆర్మూర్ : ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ సమాఖ్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ వీధిలో రోడ్డు కిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను తొలగించి రోడ్లను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, కొక్కెర భూమన్న, ఎల్ టీ కుమార్ , గడ్డం శంకర్, ఎర్ర భూమయ్య, కొంతం రాజు, రవి,గణేష్, రాజకుమార్, సాయన్న, ఖాదిర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.