Advertisement
అక్షరటుడే, బాసర: వసంత పంచమి రోజు బాసరలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. సోమవారం జ్ఞానసరస్వతి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వసంత పంచమికి భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అంతకుముందు అమ్మవారి ఆలయంలో అభిషేక పూజలో పాల్గొన్నారు. ఆయన వెంట ఆలయ ఈవో విజయరామ రాజుతో పాటు బాసర ఎంపీపీ, మాజీ సర్పంచ్ సతీశ్వర్ రావు ఉన్నారు.
Advertisement