అక్షరటుడే, ఇందూరు: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం 2025 – 26 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. కావున విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫిబ్రవరి 8వ తేదీన ఉంటుందని పేర్కొన్నారు.