అక్షరటుడే, బాన్సువాడ : రుద్రూర్ మండల కేంద్రంలో ఈనెల 16న నిర్వహించే సీపీఎం ఏరియా మహాసభను సక్సెస్ చేయాలని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ పేర్కొన్నారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో మాట్లాడారు. మూడేళ్లలో పార్టీ చేసిన పోరాటాలు, ఉద్యమాలను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు లక్ష్మణ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.