విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Date:

అక్షరటుడే, ఎల్లారెడ్డి: నియోజకవర్గంలోని అధికారులు, వైద్యులు ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు హెచ్చరించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. సరైన వైద్యం చేయకుంటే ఎవరినైనా ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో ప్రభాకర్‌, ప్రభుత్వ వైద్యాధికారి రవీంద్ర మోహన్‌, కాంగ్రెస్‌ నాయకుడు కురుమ సాయిబాబా తదితరులున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. ఈ ఘటన...

అదానీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న కెన్యా

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో కీలక ఒప్పందాన్ని కెన్యా...

గుంతను పూడ్చిన సీపీఎం నేత

అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై భారీ...

వెయిట్ లిఫ్టింగ్ టోర్నీకి ఎంపికలు పూర్తి

అక్షరటుడే, బోధన్: ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అండర్-17 బాల...