అక్షరటుడే, ఇందూరు: క్రీడలతో శారీరక, మాసినక దృఢత్వం పెంపొందుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. బుధవారం నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇంట్రామ్యూరల్ స్పోర్ట్స్, కల్చరల్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఆడపిల్లలు ఆత్మరక్షణ కోసం కర్రసాము నేర్చుకోవాలన్నారు. గిరిరాజ్ కళాశాల రాష్ట్రంలో ఎంతో గుర్తింపు పొందిందన్నారు. క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రాంమోహన్‌రెడ్డి, పీఈటీ బాలమణి, బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రవళిక, శ్రీధర్, మమత, ప్రభాకర్, గడ్డం రాజు, ఆనంద్, భాస్కర్, రాజేందర్ పాల్గొన్నారు.
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
Advertisement
Advertisement