అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ.. జిల్లా అభివృద్ధిపై లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మంత్రులు, నాయకులు మాట్లాడితే గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసి వెళ్లిందని చెబుతున్నారని, ఈ విషయం ఎన్నికల హామీలు ఇచ్చేముందు తెలియదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాదిరి మాయమాటలు చెప్పి కాలం వెల్లదీస్తున్నారన్నారు. సమావేశంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ , నాయకులు పాల్గొన్నారు.