అక్షరటుడే, కామారెడ్డి టౌన్: సీపీఎం కామారెడ్డి జిల్లా మహాసభలు మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగాయి. ఈ సభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా కందూరి చంద్రశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులుగా వెంకట్ గౌడ్, మోతీరాం, కొత్త నర్సింలు, కమిటీ సభ్యులుగా రవీందర్, సురేష్ గొండా, ముదాం అరుణ్, రేణుక, ఖలీల్, అజయ్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శి మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.