అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డిని బోధన్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పద్మ శరత్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ శరత్‌ రెడ్డి, శ్రీకాంత్‌ గౌడ్, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్ల రవీందర్‌ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ప్రమోద చిన్న, మాజీ కౌన్సిలర్‌ ప్రభాకర్, అడ్వకేట్‌ సాగర్, అర్షద్‌ పాషా, అశ్ఫాక్ పాల్గొన్నారు.