అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో టీజీవో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.