అక్షరటుడే, బాన్సువాడ: బిచ్కుంద కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురు కార్మికులను కాంట్రాక్టర్‌ విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్‌ రాములు అన్నారు. పేషంట్‌ కేర్‌, సెక్యూరిటీ, శానిటేషన్‌లో వారు పనిచేస్తున్నారన్నారు. తిరిగి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని బాన్సువాడ సహాయ కార్మిక శాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ దావూద్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకటేష్‌, ఇమ్రాన్‌, విఠల్, సుభాష్‌, శ్రద్ధ, బాలామణి తదితరులు పాల్గొన్నారు.