అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నెల 31న ఉచిత సిలిండర్ల పంపిణీ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. దీని కోసం ఈ నెల 29 నుంచి బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వారందరూ ఈ పథకానికి అర్హులని వివరించారు. గ్యాస్ సిలిండర్ కోసం మొదట డబ్బు చెల్లించాలని డెలివరీ అయిన 48 గంటల్లో ప్రభుత్వం వినియోగదారుల ఖాతాలో డబ్బు జమ చేస్తుందని తెలిపారు. ఈ పథకం కోసం రూ.2,674 కోట్లు ఖర్చు అవుతుందని నాదెండ్ల పేర్కొన్నారు.