అక్షరటుడే, వెబ్‌డెస్క్: పూణే టెస్ట్ లో న్యూజిలాండ్ టీం పటిష్ట స్థితికి చేరగా.. భారత జట్టు ఆత్మరక్షణలో పడింది. రెండో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ సెకండ్ ఇన్సింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. మొత్తంగా కేవీస్ జట్టు 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు, రవించంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశారు. న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథన్ 86 పరుగులు చేశాడు. క్రీజ్‌లో బ్లండెల్, ఫిలిప్స్ ఉన్నారు.