అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఏక్ భారత్ శేష్ట భారత్’ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర సమన్వయ బంధాన్ని పెంపొందించడానికి ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. దేశంలో వైవిధ్య సంస్కృతి గల ప్రజల మధ్య ఏకత్వాన్ని సాధించడమే కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు.