అక్షరటుడే, కామారెడ్డి: జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సింధు శర్మ సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ సమీక్ష(క్రైమ్ మీటింగ్)లో ఆమె మాట్లాడారు. అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అక్రమ మార్గాల ద్వారా అధిక వడ్డీలతో అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అఫ్సర్, ఆఫీస్ సూపరింటెండెంట్ రవీందర్ సింగ్, జూనియర్ అసిస్టెంట్ శివ, ఏఎస్సై ప్రభాకర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది కరుణాకర్, ఏ.విశ్వనాథం, ఎం.రాజు, రాజు, సాయాగౌడ్, బుచ్చయ్య, గంగాధర్, అశోక్, రవికుమార్, సంజీవులు, జి.సాయన్న, మురళి, రవీందర్, సంజీవ్, గణేష్, నర్సింలు, రాములు, విక్రమ్ రెడ్డి, ఉస్మాన్, రాజేశ్వర్ ఉన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె.నరసింహారెడ్డి, డీఎస్పీలు డి.నాగేశ్వరరావు, శ్రీనివాస్, టి.సత్యనారాయణ, మధన్ లాల్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఎం.జార్జ్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ రవీంధర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.