అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 11,062 పోసుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, స్పెషల్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ 220, ఎస్జీటీ పోస్టులు 796 ఉన్నాయి. ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. త్వరలో పరీక్ష తేదీలు ప్రకటించనుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు తిరిగి అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జిల్లాలో 601 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.