అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కారు డీఏ పెంచింది. బకాయి ఉన్న ఐదు డీఏల్లో ఒకదాన్ని (3.64 శాతం) తాజాగా విడుదల చేస్తూ జీవో నంబర్లు 120, 121లను జారీ చేసింది. జీపీఎఫ్ ఖాతాదారులకు సంబంధిత డీఏ బకాయిలను సర్దుబాటు చేయనున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ దారులకు జులై 1, 2022 నుంచి అక్టోబర్ 2024 వరకు రావాల్సిన బకాయిల్లో.. 90 శాతం 17 సమాన వాయిదాలు(వచ్చే ఏడాది జనవరి నుంచి నెలకు ఒకటి చొప్పున)గా నగదు రూపంలో చెల్లించనున్నారు. మిగతా 10శాతం సీపీఎస్ ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం డీఏ 22.75 శాతం ఉంది. పెరిగిన డీఏతో 26.39 గా మారనుంది.