అక్షరటుడే, వెన్ డెస్క్: ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి విక్టర్ అన్నారు. బుధవారం మద్నూర్ మండలంలోని సలాబత్ పూర్ చెక్ పోస్ట్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా రవాణా కాకుండా నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం మద్నూర్ మార్కెట్ యార్డు లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.