అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : కొన్నాళ్లుగా పైపైకి దూసుకుపోయిన బంగారం ధర భారీగా తగ్గింది. ఒకే రోజు సుమారు రూ. 1800 వరకు దిగొచ్చింది. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 78,560, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 72 వేలు పలికింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,790 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,650 దిగొచ్చింది. ఇక వెండి రూ. 960 పలికింది.