అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సిద్దిపేటలోని చింతపూడి చెరువులో దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన తేలు సత్యం(48), తన పిల్లలు అన్వేష్(7), త్రివేణి(5)తో కలిసి చెరువులో దూకాడు. కుటుంబ కలహాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.